![]() |
![]() |
.webp)
త్వరలో స్టార్ మా గోదావరి సీరియల్ స్టార్ట్ అవబోతోంది. ఈ సీరియల్ ప్రమోషన్ ని అవినాష్ తో చేయించారు. అమెరికా పెళ్లి చూపులు పేరుతో ఈ రాబోయే కొత్త సీరియల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ లో అనుమిత దత్త హీరోయిన్ గా చేస్తోంది. ఈమెతో పాటు గంటా మౌనిక, మధురిమ, సంధ్య వరలక్ష్మి వంటి యువ నటీమణులు నలుగురు సోదరీమణులుగా అలరించనున్నారు. ఇక జబర్దస్త్ కమెడియన్ అవినాష్ పెళ్లి చూపులకు వస్తాడు.
ముందు అనుమిత దత్త వచ్చి "మీరు డ్రింక్ చేస్తారా, నాన్ వెజ్ తింటారా, మా అక్కను బాగా చూసుకుంటారా లేదంటే అమెరికా తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేస్తారా" అని అడిగేసరికి తనకు అలంటి అలవాట్లు లేవని బుద్దిమంతుడు అని ఇంట్రావర్ట్ అని చెప్పుకుంటాడు. తర్వాత ఇంకో సిస్టర్ వచ్చి అమెరికాకు తానూ కూడా తన అక్కకు పెళ్లయ్యాక కలిసి వచ్చేస్తానని తనకు కూడా అక్కడ జాబ్ చూడాలని అడుగుతుంది. చూస్తాను మీ అక్కను పంపించు అంటాడు అవినాష్. ఇంకో సిస్టర్ వచ్చి "మీరు అమెరికా ఎప్పుడు వెళ్లారు అక్కడ మీ కార్ మీ ఇల్లు ఎలా ఉంటాయి మీరు రియల్ అమెరికన్ లానే ఉన్నారు" అనేసరికి అవినాష్ కి మెంటలొచ్చేసి సీరియస్ గా లేచి "మీ అందరికీ అమెరికా పిచ్చి బాగా పట్టింది. మొన్నటి వరకు అమెరికాలో ఉండేవాడిని ఇప్పటి నుంచి ఇండియాలో ఉందామని ఫిక్స్ ఐపోయాను.
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అమెరికా వెళ్తే తిరిగి వస్తామో రామో అని డౌట్ అక్కడ గ్రీన్ కార్డు ఉన్నవాడికంటే ఇక్కడ క్రెడిట్ కార్డు ఉన్నవాడే చాలా హ్యాపీగా ఉన్నాడు." అని గట్టిగా చెప్పేసరికి "అమెరికా సంబంధం అని చెప్పి వచ్చి ఇప్పుడు అమెరికా వెళ్లడం ఇష్టం లేదు అని చెప్తావా " అంటూ సిస్టర్స్ అంతా కలిసి గట్టిగా వాయించేశారు. "సిస్టర్స్ ఇంత వయొలెంట్ గా ఉన్నారు. అసలు వీళ్ళ గొడవేంటో తెలియాలంటే గోదావరి సీరియల్ చూడండి " అని చెప్పాడు.
![]() |
![]() |